Ongole: తుపాకీతో కాల్చుకొని ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఒంగోలు కోర్టు సెంటర్‌ వద్ద ఏఆర్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణం చెందారు.

Updated : 05 Jun 2023 19:02 IST
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎం. వెంకటేశ్వరులు అనే ఏఆర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోర్టు సెంటర్ సమీపంలో యూనియన్‌ బ్యాంక్‌ వద్ద కాపలా ఉన్న అతడు.. ఇవాళ మధ్యాహ్నం తన వద్దనున్న తుపాకీతో కాల్చుకొని బలవన్మరణం చెందాడు. రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ చీమకుర్తికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒంగోలులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని