Mahabubabad: ఉరి వేసుకొని ఏఆర్‌ ఎస్సై ఆత్మహత్య

మహబూబాబాద్‌  జిల్లాలో పడిగ శోభన్‌బాబు అనే ఏఆర్‌ ఎస్సై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 19 Sep 2023 19:56 IST

గంగారం: మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం బావురుగొండలో విషాదం చోటు చేసుకుంది. ఏఆర్‌ ఎస్సై పడిగ శోభన్‌బాబు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సత్తుపల్లి బెటాలియన్‌ ఏఆర్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెడికల్‌ లీవ్‌లో సోమవారం  ఇంటికి వచ్చిన శోభన్‌బాబు.. పొలం వద్ద ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని