తుపాకీతో కాల్చుకుని ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం వద్ద జరిగింది.

Published : 02 Jun 2024 21:36 IST

రాయచోటి: తుపాకీతో కాల్చుకుని ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం వద్ద జరిగింది. మృతురాలు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతి(28)గా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. వేదవతి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ కార్యాలయం వద్దే ఈ ఘటన చోటు చేసుకోవడం రాయచోటిలో కలకలం రేపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని