
Crime News: కరోనా నకిలీ రిపోర్టులు విక్రయిస్తున్న 2 ముఠాలు అరెస్టు
హైదరాబాద్: కరోనా నకిలీ రిపోర్టులు, వ్యాక్సినేషన్ తప్పుడు ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సినేషన్ పత్రాలు విక్రయిస్తు్న్నట్టు విచారణలో వెల్లడైంది. కొవిడ్ పరీక్షలు చేయించుకోకపోయినా నెగిటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండు డోసుల టీకా తీసుకోకపోయినా... తప్పుడు ధ్రువపత్రాలు ఇస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి నకిలీ కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్స్ 65, శాంపిల్ కలెక్షన్ కిట్స్ 20, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ‘‘ ముక్కు, గొంతు నుంచి ఎలాంటి స్వాబ్ తీసుకోకుండా నేరుగా ఖాళీ శాంపిల్‌ను టెస్టుకు పంపిస్తున్నారు. అందులో స్వాబ్లేకపోవడంతో రిపోర్టు నెగిటివ్‌గానే వస్తోంది. ఇలాంటి నకిలీ పత్రాలు ఎక్కువగా ప్రయాణానికి వినియోగిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ రూ.2 నుంచి 3వేల వరకు డిమాండ్‌ని బట్టి వసూలు చేస్తున్నారు’’ అని డీసీపీ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.