Drugs Case: ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు .....
ముంబయి: క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ కేసు విచారణను కొనసాగించనున్నట్టు బాంబే హైకోర్టు తెలిపింది. దీంతో ఆర్యన్ ఈరోజు రాత్రికి కూడా ఆర్ధర్ రోడ్డులోని జైలులోనే ఉండనున్నారు. అక్టోబర్ 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. దాదాపు రెండు వారాలకు పైగా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ తరఫున మాజీ అటార్నీ జనరల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సతీశ్ మానెశిందే బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కుట్ర పూరితంగానే ఆర్యన్‌ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండానే ఆర్యన్‌ని అరెస్టు చేసి 20 రోజులకు పైగా జైలులో ఉంచారన్నారు.
ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవన్నారు. మరి అలాంటప్పుడు ఆర్యన్ ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ప్రశ్నించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచాల బెయిల్ పిటిషన్ పైనా రేపు విచారించనున్నట్టు తెలిపారు. ఎన్సీబీ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కూడా తన వాదనలు వినిపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్