Published : 09/12/2021 01:44 IST

Fire Accident: షోరూంలో 45 BMW కార్లు దగ్ధం..!

ఠాణె: మహారాష్ట్ర నవీ ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన షోరూం కమ్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 45 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

నిన్న తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కార్లన్నీ తగలబడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 10 అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికీ భారీ నష్టం జరిగింది. ప్రమాదంలో 40 నుంచి 45 బీఎండబ్ల్యూ కార్లు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని