Sabarimala: లోయలో పడిన బస్సు.. 62మంది అయ్యప్ప భక్తులకు గాయాలు
అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదానికి గురైంది. కేరళలో యాత్రికుల బస్సు లోయలో పడిన ఘటనలో 62మంది గాయపడ్డారు.
పతనంథిట్ట: కేరళ(Kerala)లోని పతనంథిట్ట జిల్లాలో యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 62మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరంతా తమిళనాడులోని మయిలాదుతురై జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడింది. మధ్యాహ్నం 1.30 గంట సమయంలో నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్ వద్ద ఈ ఘటన జరగ్గా.. ప్రమాదం సమయంలో బస్సులో తొమ్మిది మంది చిన్నారులతో పాటు 64 మంది ఉన్నట్టు సమాచారం. వీరిలో 62మందికి గాయాలు కాగా.. వీరిలో కొందరికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం తరలించినట్టు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్