Updated : 28/03/2021 04:11 IST

మయన్మార్‌ సైన్యం కాల్పుల్లో 91మంది మృతి 

యాంగూన్‌: మయన్మార్‌లో సైన్యం అరాచకం తారస్థాయికి చేరింది. సాయుధ బలగాల దినోత్సవం రోజే అక్కడి సైన్యం రెచ్చిపోయింది. ప్రజాస్వామ్య అనుకూలవాదులపై కాల్పులు జరిపి రక్తపాతం సృష్టించింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన పౌరులపై దేశవ్యాప్తంగా యాంగూన్, మాండలే, నేపిటవ్‌ తదితర నగరాలు, పట్టణాల్లో శనివారం జరిపిన కాల్పుల్లో 91 మందికి పైగా మృతిచెందినట్టు  అక్కడి మీడియా వెల్లడించింది.

మయన్మార్‌లో ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో తిరుగుబావుటా ఎగురవేసిన సైన్యం  దేశపాలనను తమ గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.  అప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ప్రజా నిరసనలను అణిచివేస్తున్న మయన్మార్‌ సైన్యం.. కాల్పులకు తెగబడుతోంది. అప్పట్నుంచి జరుగుతున్న వేర్వేరు ఘటనల్లో భద్రతాదళాల కాల్పుల్లో ఇప్పటివరకు 419మంది మృతిచెందినట్టు సమాచారం.

మయన్మార్‌ 76వ సాయుధ దళాల దినోత్సవం బీభత్సానికి, అవమానానికి వేదికగా నిలిచిందని యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధి బృందం ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారులతో పాటు నిరాయుధులైన పౌరులను చంపడాన్ని ఖండించింది. మరోవైపు, శుక్రవారం వరకు మయన్మార్‌లో 300 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని అక్కడి న్యాయవాదులు ,మీడియా విడుదల చేసిన నివేదికలో తేలింది. సైన్యం తుపాకీ కాల్పుల్లోనే వీరిలో 90శాతం మంది మృతిచెందినట్టు పేర్కొంది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని