Andhra News: అమర్తలూరు పోలీస్‌ స్టేషన్‌లో వైకాపా కార్యకర్తల వీరంగం

బాపట్ల జిల్లా అమర్తలూరు పోలీస్‌ స్టేషన్‌లో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో పోలీసులను దూషిస్తూ శ్లారా, వెంకట పోలీస్‌ స్టేషన్‌లోనే వీరంగం వేశారు.

Published : 01 Apr 2023 17:31 IST

అమర్తలూరు: బాపట్ల జిల్లా అమర్తలూరు పోలీస్‌ స్టేషన్‌లో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. పాత కేసులో నిందితుడైన పాంచాలవరం గ్రామానికి చెందిన శ్లారాను విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణ జరుగుతున్న సమయంలో తన సోదరుడిని ఎందుకు స్టేషన్‌కు తీసుకొచ్చారంటూ అన్న వెంకట్‌ పోలీసులపై దౌర్జన్యానికి దిగాడు. అసభ్య పదజాలంతో పోలీసులను దూషిస్తూ శ్లారా, వెంకట్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే వీరంగం వేశారు. గొడవ జరుగుతున్న సమయంలో శ్లారా పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ప్రస్తుతం వెంకట్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఇద్దరూ వైకాపాలో క్రియాశీలకంగా ఉన్నారని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు