Jangareddygudem: కత్తితో దంపతులు, కుమారుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది.

Updated : 02 Apr 2023 14:01 IST

 

జంగారెడ్డిగూడెం పట్టణం: ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  మైసన్నగూడేనికి చెందిన తోనం శివ(28), ఆయన భార్య చిన్ని(26), కుమారుడు మంగరాజు(11)లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున శివ ఎప్పటిలాగే పొగాకు సేకరణకు సంబంధించిన పనికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత పనిచేస్తున్న చోటే శివ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఓ వ్యక్తి గమనించాడు. ఈ విషయాన్ని శివ భార్యకు తెలిపేందుకు అతడి ఇంటికి వెళ్లాడు. 

అయితే ఇంటి దగ్గర శివ భార్య చిన్ని, కుమారుడు మంగరాజు కూడా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన సదరు వ్యక్తి బంధువులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో ఉన్నవారిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు శివ ఇంటిని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపైనా దాడికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు