గర్భంతో ఉన్న అటవీశాఖ ఉద్యోగినిపై దాడి..మాజీ సర్పంచి పైశాచికం

గర్భంతో ఉన్న అటవీ శాఖ ఉద్యోగినిపై గ్రామ మాజీ సర్పంచి, అతని భార్య కలిసి దాడి చేశారు. మహారాష్ట్రలోని సతారా

Updated : 21 Jan 2022 12:02 IST

గర్భంతో ఉన్న అటవీ శాఖ ఉద్యోగినిపై గ్రామ మాజీ సర్పంచి, అతని భార్య కలిసి దాడి చేశారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా పల్సవాడే గ్రామంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు స్థానికంగా అటవీ నిర్వహణ కమిటీలో సభ్యుడు. గతంలో సర్పంచిగా కూడా పనిచేశాడు. తన అనుమతి లేకుండా ఒప్పంద ఉద్యోగులను వెంట తీసుకెళ్లారనే కోపంతో అటవీ శాఖ మహిళా గార్డ్‌పై కోపోద్రిక్తుడయ్యాడు. ఆమె గర్భంతో ఉందని చూడకుండా తన భార్యతో కలిసి దాడి చేశాడు. బూటు కాలుతో కడుపుపై తన్నాడు. బాధితురాలు ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. ఈ ఘటనపై మంత్రి ఆదిత్య ఠాక్రే తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులపై దాడులు సహించబోమని, బాధితురాలికి జరగకూడనిది జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని