Crime News:  జగిత్యాలలో ముగ్గురు యువకులపై కత్తులతో దాడి

జగిత్యాల పట్టణంలోని తీన్‌ఖాని చౌరస్తాలో గురువారం అర్ధరాత్రి ముగ్గురు యువకులపై కత్తులతో దాడి జరిగింది. 

Updated : 05 Nov 2021 11:54 IST

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని తీన్‌ఖాని చౌరస్తాలో గురువారం అర్ధరాత్రి ముగ్గురు యువకులపై కత్తులతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని బాధితుల తరఫున పలువురు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత వర్గం ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని