
యూట్యూబ్ చూసి.. నకిలీనోట్లు తయారు చేసి
హైదరాబాద్: ఎవరైనా వినోదం కోసం యూట్యూబ్ చూస్తారు లేదా విద్యను అభ్యసించేందుకు చూస్తారు. కానీ, ఓ వ్యక్తి యూట్యూబ్‌లో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకుని కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పఠాన్‌చెరువు జేపీ కాలనీకి చెందిన ఉప్పరి రాజుప్రసాద్ అలియాస్ రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దొంగ నోట్ల చెలామణి మొదలుపెట్టాడు.
పఠాన్ చెరువు, మండవల్లి, ఏలూరు, బాచుపల్లి, సంగారెడ్డిలో దొంగనోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చాక కూడా బుద్ధిమారని రాజుప్రసాద్ ఓఎల్ఎక్స్లో కలర్ ప్రింటర్ కొనుగోలు చేసి, దానిని ఉపయోగించి రెండు వేల రూపాయల నోట్లు ముద్రించాడు. అందులో నుంచి.. ఇస్నాపూర్‌లోని చెప్పుల దుకాణంలో ఓ నోటును మార్చిన రాజు... కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్లో నకిలీ నోట్లు మారుస్తూ పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి 14 నకిలీ రెండువేల రూపాయల నోట్లు, కలర్ ప్రింటర్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.