Vijayawada: రెండు వాహనాలు ఢీ.. కారుపైకి ఎక్కేసిన గ్యాస్‌ సిలిండర్ల ఆటో

విజయవాడ బందరు రోడ్డులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. సినీ పోలీస్ మాల్ ఎదుట వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల ఆటో..

Published : 27 Jan 2022 17:27 IST

విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. సినీ పోలీస్ మాల్ ఎదుట గ్యాస్ సిలిండర్ల వెళ్తున్న ఆటో.. ఓ వాహనాన్ని తప్పించబోయి కారును వేగంగా ఢీకొట్టింది. అదే క్రమంలో సిలిండర్ల ఆటో కారుపైకి ఎక్కేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బందరు రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు