Telangana News: బ్యాంకులను మోసం చేసిన బల్వీందర్‌ సింగ్‌ అరెస్టు

బ్యాంకులను మోసం చేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పీసీహెచ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ బల్వీందర్‌సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌..

Published : 11 Feb 2022 01:29 IST

హైదరాబాద్‌: బ్యాంకులను మోసం చేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పీసీహెచ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ బల్వీందర్‌సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసింది. బల్వీందర్‌సింగ్‌ పీసీహెచ్‌ గ్రూప్‌ సంస్థల పేరిట వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సుమారు రూ.370 కోట్ల మోసానికి పాల్పడ్డారని చెన్నై, బెంగళూరులో సీబీఐ  గతంలో కేసులు నమోదు చేసింది. సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీల ద్వారా వ్యక్తిగత, సంస్థల ఖాతాలకు మళ్లించుకున్నట్టు తేలిందని ఈడీ వెల్లడించింది. బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా మోసం చేశారని తెలిపింది. బల్వీందర్‌సింగ్‌కు న్యాయస్థానం ఈనెల 23 వరకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని