Anakapalle: తుపాకీతో బెదిరించి పట్టపగలు బ్యాంకులో చోరీ

పట్టపగలు బ్యాంకులో జరిగిన దోపిడీ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం కశింకోట మండలం నర్సింగపల్లి గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చొరబడిన దుండగులు తుపాకీతో క్యాషియర్‌ను బెదిరించారు.

Updated : 30 Apr 2022 17:28 IST

కశింకోట: పట్టపగలు బ్యాంకులో జరిగిన దోపిడీ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం కశింకోట మండలం నర్సింగపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చొరబడిన దుండగుడు తుపాకీతో క్యాషియర్‌ను బెదిరించాడు. అతని వద్ద ఉన్న రూ.3.30లక్షలు లాక్కొని పరారయ్యాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బందితో పాటు ఖాతాదారులు కంగుతిన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి ఖాతాదారుడి మాదిరిగా బ్యాగ్‌ తగిలించుకుని, హెల్మెట్‌ ధరించి  బ్యాంకులోపలికి వచ్చాడని సిబ్బంది తెలిపారు. దోపిడీ తర్వాత నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని