
Crime news: నీలి చిత్రాల్లో నటించిందన్న అనుమానం.. భార్యను కడతేర్చిన ప్రబుద్ధుడు
బెంగళూరు: నీలి చిత్రాలకు అలవాటుపడిన ఓ ప్రబుద్దుడు అమానుషానికి పాల్పడ్డాడు. ఆ చిత్రాల్లో నటించిందేమోనన్న అనుమానంతో తన భార్యనే కడతేర్చాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ జహీర్ పాషా తరచూ పోర్న్ చూసేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చూసిన ఓ చిత్రంలో కనిపించింది తన భార్యేనని అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఇదే క్రమంలో ఈ ఆదివారం ఆమెను హత్య చేశాడు. తన పిల్లల ముందే కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు.
జహీర్ పాషా దంపతులకు 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ భార్యపై జహీర్ నిత్యం ఆరోపణలు చేసేవాడు. రెండు నెలల క్రితం పోర్న్ వీడియోను చూసినరోజే.. ఓ కుటుంబ ఫంక్షన్లో భార్యను తీవ్రంగా కొట్టాడు. తర్వాత నిత్యం వేధింపులకు గురిచేశాడు. 20 రోజుల క్రితం తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. ఈ క్రమంలోనే హత్య చేసేందుకు వెనకాడలేదు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన కుమారుడు భయంతో వెంటనే తాతయ్య ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Afghanistan Earthquakes: భూకంపాలు అక్కడ సర్వసాధారణం..!
-
India News
Karnataka: మీరు సక్రమంగా పనిచేయాలంటే ప్రధాని, రాష్ట్రపతి తరచూ పర్యటించాలా?: హైకోర్టు
-
Movies News
Rakul Preet Singh: నెట్టింటిని షేక్ చేస్తోన్న రకుల్ డ్యాన్స్.. వీడియో వైరల్
-
General News
JEE Mians: చుక్కలు చూపిస్తున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలు..
-
Politics News
Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- చేత్తో నెడితేనే నిర్మాణాలు నేలమట్టం.. వైరల్‌గా మారిన యూపీ ఎమ్మెల్యే వీడియో!
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం