Crime: కండోమ్‌ తీసుకురాలేదని బాలుడిపై దాడి

తమ్ముడు వయస్సు ఉన్న బాలుడిపై ఒక యువకుడు కర్కశంగా ప్రవర్తించాడు. రక్షణ కల్పించాల్సిన అతను.. కండోమ్‌ తీసుకురావాలని ఆ బాలుడిని ఒత్తిడి గురిచేశాడు. దీనికి అతడు...

Updated : 07 Aug 2021 19:34 IST

 పుణెలో ఘటన, యువకుడి అరెస్టు

పుణె: తమ్ముడు వయస్సు ఉన్న బాలుడిపై ఒక యువకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కండోమ్‌ తీసుకురావాలని ఆ బాలుడిని ఒత్తిడికి గురిచేశాడు. దీనికి అతడు నిరాకరించడంతో  కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్లితే.. పుణెకి చెందిన నీలేశ్‌ (21) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడి దగ్గరకు వెళ్లి దగ్గరలోని ఓ ఫార్మసి స్టోర్‌కి వెళ్లి కండోమ్‌ ప్యాకెట్‌ తీసుకురమ్మని బెదరించాడు. దీనికి అతడు నిరాకరించడంతో దూషిస్తూ.. కొట్టడం మొదలెట్టాడు. అంతేకాదు.. కత్తితో మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అతడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపిన ఆధారాల ప్రకారం.. సమీపంలో ఉన్న కారు నుంచి కత్తి తీసి దాడి చేశారని పోలీసులకు సమాచారం అందించాడు. బాలుడి కుటుంబసభ్యులు పుణెలోని చందానగర్‌ ఠాణాలో చేసిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని