Kakinada: షుగర్‌ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరి మృతి.. 9 మందికి గాయాలు

కాకినాడ సమీపంలోని ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. వాకలపూడి పారిశ్రామికవాడలోని పంచదార శుద్ధి పరిశ్రమలో

Updated : 19 Aug 2022 16:09 IST

సర్పవరం జంక్షన్‌:  కాకినాడ గ్రామీణం పరిధి వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ‘ప్యారీ షుగర్స్‌’ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.  విద్యుదాఘాతం కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గోదాంలో చక్కెర బస్తాలు లోడు చేస్తుండగా కన్వేయర్‌ బెల్టుకు విద్యుత్ కనెక్షన్‌ ఇచ్చే సందర్భంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది.

ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ(36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వరరావు(45)గా గుర్తించారు.

గాయపడిన వారిలో పిఠాపురం మండలం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీర వెంకట రమణ(29) పరిస్థితి విషమంగా ఉంది. అతడిని కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 8 మంది కాకినాడ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలాన్ని పోలీసుల పరిశీలించారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని