Ganga: గంగానదిలో పడవ మునక.. ఆరుగురు గల్లంతు

గంగా నదిలో పడవ బోల్తా పడి మునిగిపోయిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు.

Published : 16 Jun 2024 16:53 IST

పట్నా: గంగా నదిలో ప్రమాదం చోటుచేసుకుంది. పర్యటకులను తీసుకెళ్తున్న ఓ పడవ బోల్తా పడి మునిగిపోయింది. మొత్తం అందులో 17 మంది ఉండగా.. ఆరుగురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది.. గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్‌లోని బాఢ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

‘‘17 మంది సందర్శకులతో ఉమానాథ్‌ ఘాట్‌ నుంచి దియారాకు ఓ పడవ బయలుదేరింది. ఈ క్రమంలో నది మధ్యలో అది బోల్తాపడి మునిగిపోయింది. అందులోని వారంతా దాదాపు ఒకే కుటుంబానికి చెందినవారు. 11 మందిని రక్షించగలిగాం. వీరిలో కొందరు ఈదుకుంటా బయటకు రాగా.. ఆరుగురు జాడ మాత్రం తెలియరాలేదు’ అని బాఢ్‌ జిల్లా ఎస్‌డీఎం సుభం కుమార్‌ పేర్కొన్నారు. గల్లంతైన వారికోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని