Crime: పబ్‌జీ కోసం తల్లి అకౌంట్ నుంచి ₹10లక్షలు.. ఇంటి నుంచి బాలుడి జంప్‌!

ఆ టీనేజీ కుర్రాడికి పబ్‌జీ అంటే పిచ్చి. అది కాస్త ఓ వ్యసనంలా మారింది. ఎంతలా అంటే.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10లక్షలు ఖర్చుపెట్టేంతగా . ఇదికాస్త ఆ యువకుడి తల్లితండ్రులకు తెలియడంతో మందలిచారు.

Published : 28 Aug 2021 02:09 IST

ముంబయి: ఆ టీనేజీ కుర్రాడికి పబ్‌జీ అంటే పిచ్చి. అది కాస్త ఓ వ్యసనంలా మారింది. ఎంతలా అంటే.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10లక్షలు ఖర్చుపెట్టేంత}ఇది కాస్త ఆ యువకుడి తల్లితండ్రులకు తెలియడంతో మందలిచారు. అంతే ‘‘అమ్మానాన్న!.. నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నా ’’ అంటూ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయాడు. ఇదంతా ముంబయిలో జోగేశ్వరి ప్రాంతంలో జరిగింది. దీంతో ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ తెలపాలంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు..  రంగంలోకి దిగి గురువారం మధ్యాహ్నం ఆ బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడి ఇంటి నుంచి సుమారు 5 కి.మీ దూరంలో ఉండే మహాంకాళి గుహల్లో భయపడుతూ పోలీసులకు కనిపించాడు. విచారణలో భాగంగా తల్లిదండ్రులను పలు ప్రశ్నలు అడగ్గా.. గతనెల నుంచే తమ పిల్లాడు పబ్‌జీ ఆటకు అలవాటు పడ్డారన్నారు. మొబైల్‌ ఫొన్‌లో పబ్‌జీ ఆడుతూ.. తల్లి బ్యాంకు ఖాతా నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ.10లక్షల ఖర్చుచేశాడన్నారు. వెంటనే పిల్లాడిని మందలించేసరికి లేఖ రాసి ఇంటి నుంచి పారిపోయడన్నారు. చివరికి బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులతో ఇంటికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని