Hyderabad: అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!

రాయదుర్గంలో పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.

Updated : 26 Sep 2023 11:01 IST

హైదరాబాద్: రాయదుర్గంలో పదో తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి బాలుడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్‌లో వెలుగులోకి మరో ఘోరం..!

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం రాత్రి 7.30 గంటలకు బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాకపోయేసరికి అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కుమారుడి కోసం వెతికారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7గంటలకు బాలుడి కుటుంబం నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ పక్క బ్లాక్‌ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొన్ని రోజులుగా విద్యార్థి ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసకావటం.. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని