Bride commits suicide: ఆరోపణ శూలమై.. మనసు గాయమై!
భర్త మోపిన చోరీ నిందారోపణ, వేధింపుల్ని భరించలేక పెళ్లయిన నెల రోజులకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది.
నవ వధువు బలవన్మరణం
హత్నూర, న్యూస్‌టుడే: భర్త మోపిన చోరీ నిందారోపణ, వేధింపుల్ని భరించలేక పెళ్లయిన నెల రోజులకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పన్యాలలో గురువారం చోటుచేసుకుంది. జిన్నారం సీఐ వేణుకుమార్, ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు.. పన్యాలకు చెందిన నీరుడి బాగయ్యకు సదాశివపేట మండలం రెండ్లపల్లికి చెందిన అఖిల(19)తో మే 7న వివాహమైంది. 4 రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో నుంచి బంగారు గొలుసు పోయిందని, నువ్వే తీశావంటూ బాగయ్య ఫోన్ చేసి భార్యను అడిగాడు. దొంగతనం చేయాల్సిన అవసరం తనకు లేదని ఆమె భర్తతో వాదించింది. అనంతరం ఈ నెల 6న బాగయ్య అత్తారింటికి వెళ్లాడు. అక్కడా గొడవ జరిగింది. భార్యాభర్తలిద్దరూ బుధవారం పన్యాలకు వచ్చారు. మరోసారి బాగయ్య అవే ఆరోపణలు చేయగా.. కుటుంబ సభ్యులు అతడికి వంత పాడారు. దీంతో మనస్తాపం చెందిన అఖిల ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి భర్తే కారణమని, పోయిందన్న బంగారు గొలుసు ఇంట్లోనే దొరికిందని అఖిల లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అఖిల తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇంటివద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్రోవర్
-
PM Modi: మహబూబ్నగర్ చేరుకున్న ప్రధాని మోదీ