Updated : 18 Apr 2022 11:10 IST

Andhra News: తన సోదరిపై ఎఫ్‌బీలో పోస్టులు పెట్టాడని.. యువకుడి మర్మాంగంపై దాడి

చాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెంలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన సోదరిపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు చేశాడని యువతి సోదరుడు యువకుడు శ్రీకాంత్‌పై దాడి చేశాడు. మాట్లాడదామని యువకుడిని తమ ఇంటికి పిలిపించిన యువతి సోదరుడు అతడి మర్మాంగంపై దాడి చేశారు.

ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని యువతి ఇంటి నుంచి 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నూజివీడు అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై చాట్రాయి పీఎస్‌లో యువతి సోదరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని