
Updated : 24 Dec 2021 05:24 IST
Viral Video : అమానవీయం.. సెల్‌ఫోన్ దొంగలించాడంటూ తలకిందులుగా వేలాడదీసి..!
మంగళూరు : కర్ణాటకలోని మంగళూరులో అమానవీయ ఘటన జరిగింది.సెల్‌ఫోన్ దొంగతనం చేశాడనే ఆరోపణతో సాటి మత్స్యకారుడిపై సహచరులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైల శ్రీను మంగళూరులో పని చేస్తున్నాడు. బుధవారం ఓ మత్స్యకారుడి సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో, దానిని శ్రీనే దొంగలించాడనే అనుమానంతో మిగిలిన వారు అతడ్ని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. సెల్‌ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పమంటూ వేధించారు. ఆ తర్వాత అతడిని తాడుతో కట్టేశారు. శ్రీనును కొట్టిన మత్స్యకారులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని సమాచారం. ఈ తతంగం మొత్తాన్ని ఎవరో వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు.
ఇవీ చదవండి
Tags :