Building Collapse: లఖ్‌నవూలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

లఖ్‌నవూలోని ఇజ్రత్‌ గంజ్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. 15 కుటుంబాలు అందులో చిక్కుకున్నట్లు సమాచారం.

Updated : 24 Jan 2023 20:16 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇజ్రత్‌ గంజ్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 15 కుటుంబాలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరాదిలో ఇవాళ ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భవనం కూలిపోయినట్లు సమాచారం. 

ముగ్గురి మృతి..శిథిలాల్లో ఇంకొందరు: డిప్యూటీ సీఎం

భవనం కుప్పకూలినట్లు  యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పతక్‌ ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు  మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మరికొందరు శిథిలాల్లో  చిక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని