వికారాబాద్‌లో తూటా కలకలం

వికారాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఒక బుల్లెట్(తూటా)‌, మ్యాగ్జిన్‌ లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని యాలాల పోలీస్‌స్టేషన్‌

Updated : 17 Jan 2021 06:36 IST

తాండూరు: వికారాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఒక బుల్లెట్(తూటా)‌, మ్యాగజిన్‌ లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని యాలాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల  అటవీ ప్రాంతంలో ఒక బుల్లెట్‌తో పాటు బుల్లెట్లను భద్రపరిచే మ్యాగజిన్‌‌ లభించింది. అటవీ ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లిన కొంత మంది గ్రామస్థులు వాటిని గుర్తించి గ్రామ సర్పంచికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామ సర్పంచి అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్‌, మ్యాగజిన్‌‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా అడవిలో వేటకు వచ్చి వాటిని అక్కడ వదిలి వెళ్లారా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 

ప్రేయసిని చంపి.. గోడలో దాచి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని