
TS News: ప్రయాణికుల సామాన్లతో డ్రైవర్ పరార్!
ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారు. సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యతను విస్మరించి.. మధ్యలోనే వదిలి వాళ్ల సామాన్లతో ఉడాయించిన ఘటన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులో చోటుచేసుకుంది. కేరళ నుంచి అసోంకు 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద అల్పాహారం కోసం డ్రైవర్ ఆపాడు. ప్రయాణికులు అందరూ కిందకు దిగగానే డ్రైవర్, క్లీనర్ లగేజీతో అదే బస్సులో ఉడాయించారు. ప్రయాణికులు బిహార్, బెంగాల్, నేపాల్, అసోంకు చెందిన వలస కూలీలు. తమ సామాన్లు, డబ్బు పోవడంతో వారంతా నార్కట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. కేరళలో పనులు చేసుకొని స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏజెంట్ ద్వారా ఒక్కొక్కరు రూ.3,500 చెల్లించినట్టు తెలిపారు. బస్సు డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. బాధితులకు తాత్కాలికంగా స్థానికంగా ఓ ఫంక్షన్హాల్లో రాత్రి బసకు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.