Crime news: నార్కట్‌పల్లి వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ - హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నట్టు

Published : 21 Oct 2021 01:20 IST

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ - హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న నార్కట్‌పల్లి పోలీసులు గంజాయితో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గంజాయి కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రవాణా అవుతూనే ఉంది. 

తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గంజాయిపై తీవ్ర యుద్ధం ప్రకటించాలని సీఎం పిలుపునిచ్చారు. గంజాయి కట్టడి చేసిన అధికారులకు అధికారులకు నగదు బహుమతులు, ప్రత్యేక పదోన్నతులు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని