Crime News: మిర్యాలగూడలో కారు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న హోటల్‌లోకి  కారు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది...

Published : 07 Aug 2022 22:17 IST

మిర్యాలగూడ పట్టణం: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న హోటల్‌లోకి  కారు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఒకటో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఆర్డీవో కార్యాలయం వైపు నుంచి హౌసింగ్‌ బోర్డు కాలనీ వైపు వెళ్తున్న ఓ కారు హోటల్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ క్రమంలో హోటల్‌ ఎదురుగా ఉన్న నాలుగు ద్విచక్రవాహనాల పైకి దూసుకెళ్లడంతో అవి ధ్వంసమయ్యాయి. ఆ పక్కనే ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గాయపడ్డ వారిని సమీపంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం. శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు