hyderabad: జూబ్లీహిల్స్‌లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్‌ క్షేమం

జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

Published : 15 Jun 2024 22:34 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.  జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్‌, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్‌ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునేలోపే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని