మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై కేసు నమోదు

మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పుట్ట శైలజపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఆమెపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది

Published : 07 Apr 2021 01:38 IST

పెద్దపల్లి: మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పుట్ట శైలజపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఆమెపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణలో భాగంగా ఈ నెల 19న నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శైలజ.. బిట్టు శ్రీనుతో వీడియో కాల్‌ మాట్లాడించినట్లు అప్పుడు విధుల్లో ఉన్న ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. వారించినా వినకుండా నిందితుడితో ఫోన్ మాట్లాడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మంథని న్యాయస్థానం ఆదేశాలతో సెక్షన్ 186 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని