తుపాకీ పేల్చిన పెళ్లి కుమార్తె.. కేసు నమోదు

పెళ్లి పీటలపైకి ఎక్కబోతూ ఓ వధువు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా జెత్వారా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ వివాహ వేడుకలో పెళ్లి కూతురు.. వరుడుతో పాటు పెళ్లి మండపంపైకి ఎక్కుతూ తన వివాహం ఎప్పటికీ

Published : 02 Jun 2021 01:07 IST

లఖ్‌నవూ: పెళ్లి పీటలపైకి ఎక్కబోతూ ఓ వధువు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా జెత్వారా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ వివాహ వేడుకలో పెళ్లి కూతురు.. వరుడుతో పాటు పెళ్లి మండపంపైకి ఎక్కుతూ తన వివాహం ఎప్పటికీ గుర్తిండిపోయే విధంగా ఉండాలని తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది. అయితే, ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసుల కంటపడింది. 

ఆ వీడియో ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు వధువు రూపా పాండేగా గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే తుపాకీ యజమాని, వధువు మేనమామ రామ్‌నివాస్‌ పాండేపై కూడా కేసు నమోదు చేశారు. లైసెన్స్‌డ్‌ తుపాకే అయినా, నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించినందుకు పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు. రామ్‌నివాస్‌ తపాకీ లైసెన్స్‌ను రద్దు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద సంఖ్యలో అతిథుల మధ్య పెళ్లి వేడుక నిర్వహించినందుకు పెళ్లి పెద్దలపై మరో కేసు కూడా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో వివాహానికి 25 మందికి మించి అతిథులు హాజరుకాకూడదనే నిబంధన ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు