
Updated : 21 Oct 2021 17:59 IST
Crime news: ప్రేమించి మోసం చేశారని ట్రైనీ ఐఏఎస్‌పై కూకట్‌పల్లిలో కేసు నమోదు
హైదరాబాద్: ట్రైనీ ఐఏఎస్ బానోత్ మృగేందర్‌లాల్‌పై కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృగేందర్‌లాల్ .. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుమారుడు. ప్రస్తుతం మదురైలో ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్నారు. ఫేస్బుక్లో మృగేందర్‌లాల్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి మృగేందర్‌లాల్ నిరాకరిస్తున్నారని, తన కుమారుడిని వదిలేయాలని ఆయన తండ్రి బెదిరిస్తున్నారని యువతి ఆరోపించారు. రూ.25లక్షలు డబ్బు కూడా ఆశచూపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 27న కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐఏఎస్ పై కేసు నమోదు కాగా.. ఆలస్యంగా ఈఘటన వెలుగులోకి వచ్చింది.
Tags :