Andhra News: ట్రావెల్స్‌ బస్సులో రూ.4.76కోట్లు.. ఎక్కడంటే..

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 01 Apr 2022 15:43 IST

గోపాలపురం: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్‌ బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ.4కోట్లకు పైగా నగదు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 39 టీబీ 7555 నంబరు గల బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో బస్సు సీట్ల కింద లగేజ్‌ క్యారియర్‌లో భారీగా నగదు తరలిస్తుండటాన్ని గమనించారు. దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బస్సులో తరలిస్తున్న నగదును పోలీసులు లెక్కించగా రూ.4.76కోట్లు ఉన్నట్లు తేల్చారు. దీంతో పాటు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని