వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో నగదు చోరీ

ప్రజలకు రక్షణ కల్పించి, చోరీలు, దోపిడీలకు అడ్డుకట్ట వేసే పోలీసులు ఉండే చోటే డబ్బు చోరీ కావడం కలకలం సృష్టించింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో

Updated : 18 Mar 2021 01:40 IST

వీరవాసరం: ప్రజలకు రక్షణ కల్పించి, చోరీలు, దోపిడీలకు అడ్డుకట్ట వేసే పోలీసులు ఉండే చోటే డబ్బు చోరీ కావడం కలకలం సృష్టించింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో రూ.8 లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, రాయకుదురు మద్యం దుకాణాలకు సంబంధించిన నగదును సోమవారం పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. ఈనెల 15 నుంచి బ్యాంకులకు సెలవు కావడంతో ఆయా దుకాణాల సిబ్బంది నగదును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం ఆ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన దుకాణ సిబ్బందికి డబ్బు కనిపించలేదు. మద్యం దుకాణాలకు చెందిన రూ,8,04,330 నగదు చోరీకి గురైనట్లు గ్రహించి వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

చోరీకి గురైన నగదులో వీరవాసరం మద్యం దుకాణానికి సంబంధించి రూ.1,50,000, నౌడూరు దుకాణానివి రూ.2,16,060, కొణితివాడ దుకాణం నగదు రూ.50,000, రాయకుదురు దుకాణానికి చెందిన రూ.3,88,270 నగదు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. నగదు అపహరణ విషయమై పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని