గుంటూరులో నడిరోడ్డుపై రూ.9 లక్షల దోపిడీ

ద్విచక్రవాహనంలో లక్షల రూపాయలు ఉంచిన వ్యక్తి ఓ దొంగ చేతివాటంతో ఆ మొత్తాన్నీ నష్టపోయాడు. గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్‌ బ్యాంకులో రూ.9 లక్షలు....

Published : 19 Apr 2021 12:35 IST

గుంటూరు: నడిరోడ్డుపై, పట్టపగలే లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్‌ బ్యాంకులో రూ.9 లక్షలు డ్రాచేసి డబ్బు సంచిని ద్విచక్రవాహనం డిక్కీలో ఉంచాడు. స్థానికంగా టిఫిన్‌ చేసిన అనంతరం తన దుకాణానికి వెళ్లి బైక్‌లో డబ్బు కోసం చూడగా కనిపించలేదు. చోరీకి గురైందని గమనించి లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు.

డబ్బును ఓ వ్యక్తి దొంగిలించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ద్విచక్రవాహనంలో డబ్బు పెడుతుండగా  సమీపంలోనే ఉండి గమనించిన ఓ దొంగ గమనించాడు. వాహనదారుడు టిఫిన్‌ చేసేందుకు వెళ్లగానే ద్విచక్రవాహనం డిక్కీ తెరిచి ఆ మొత్తాన్ని దొంగిలించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు