Crime News: వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఛార్జిషీట్ దాఖలు

Updated : 05 Feb 2022 03:55 IST

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ మేరకు పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు మరో ఛార్జిషీట్ వేశారు. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా శివశంకర్‌రెడ్డి ఉన్నాడు. గతేడాది నవంబర్ 17న శివశంకర్‌ను హైదరాబాద్‌లో సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో గతంలోనే ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అయితే మొదటి ఛార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లను చేర్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని