Chain Snatching: పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

ఘజియాబాద్‌లో పట్టపగలు చైన్  స్నాచర్లు రెచ్చిపోయారు. షాహిబాబాద్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ

Updated : 25 Mar 2023 17:13 IST

దిల్లీ: దిల్లీ శివారు నగరమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పట్టపగలు చైన్  స్నాచర్లు రెచ్చిపోయారు. షాహిబాబాద్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ నుంచి బంగారు గొలుసును అందరూ చూస్తుండగానే ఎత్తుకెళ్లారు. తొలుత ఓ మహిళను ఇద్దరు దొంగలు గమనించి వెంబడించారు. ఆపై అదును చూసుకొని ఒక దొంగ మహిళ మెడలోని చైన్  లాక్కొని పరిగెత్తాడు. అప్పటికే ద్విచక్ర వాహనంతో సిద్ధంగా ఉన్న మరో దొంగ బండి ఎక్కి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా రెండు వారాల వ్యవధిలో ఘజియాబాద్‌లో పలు చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు