టీసీఎస్‌లో ఉద్యోగమంటూ యువతికి టోకరా

టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ యువతికి టోకరా వేశారు.

Updated : 04 Jul 2021 11:06 IST

హైదరాబాద్: టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ యువతికి టోకరా వేశారు. బషీరాబాగ్‌కు చెందిన యువతి ఇటీవల నౌకరీ డాట్‌ కామ్‌లో బయోడేటా అప్‌లోడ్‌ చేశారు. దీని ఆధారంగా కేటుగాళ్లు యువతికి ఫోన్‌ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఉద్యోగానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పేరిట రూ.లక్షకు పైగా వసూలు చేశారు. అనంతరం మోసపోయానని గుర్తించిన యువతి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని