Crime: కొడుకును కిడ్నాప్‌ చేశామంటూ.. కుమారుడే తండ్రికి ఫోన్‌ చేస్తే..!

‘‘ మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం. వెంటనే రూ.30లక్షలు తీసుకొచ్చి ఇవ్వండి లేదా మీ అబ్బాయి ప్రాణాలతో బతకడదు’’ అంటూ డబ్బు కోసం తండ్రికే ఫేక్ కిడ్నాప్‌ కాల్ చేశాడో తనయుడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. సినిమా కిడ్నాప్‌ సీన్‌ని తలపించేలా ఉన్న కిడ్నాప్ సన్నివేశాన్ని అమలు చేసిన కుమారుడి పేరు కృష్ణ ప్రసాద్‌ (24).

Published : 20 Jan 2022 02:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ మీ అబ్బాయిని కిడ్నాప్‌ చేశాం. వెంటనే రూ.30లక్షలు తీసుకొచ్చి ఇవ్వండి లేదా మీ అబ్బాయి ప్రాణాలతో బతకడు’’ అంటూ డబ్బు కోసం తండ్రికే ఫేక్ కిడ్నాప్‌ కాల్ చేశాడో తనయుడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. సినిమాను తలపించేలా ఉన్న కిడ్నాప్ సన్నివేశాన్ని అమలు చేసిన కుమారుడి పేరు కృష్ణ ప్రసాద్‌ (24). చెన్నైకి చెందిన ఈ యువకుడికి.. షార్ట్‌ ఫిల్మ్ అంటే పిచ్చి. తీసేందుకు చేతిలో సరిపడా డబ్బులేకపోవడంతో ఓ పన్నాగం రూపొందించాడు. చెన్నై వడపలానిలో వ్యాపార్థస్తుడైన తన తండ్రి పెన్సీలయ్యకు కిడ్నాపర్‌నంటూ బెదిరింపు కాల్‌ చేశాడు. ఆ కాల్‌తో ఉక్కిరిబిక్కి అయ్యి .. వెంటనే చెన్నై నగర పోలీసులను ఆశ్రయించాడు. ఎలాగైనా కిడ్నాపర్ల నుంచి తన కొడుకును రక్షించాలని వేడుకున్నాడు. కృష్ణ ప్రసాద్‌ ఫోన్‌ నెంబర్‌ నుంచే తన కొడుకును కిడ్నాప్ చేశామని.. రూ.30లక్షలు ఇస్తే ప్రాణాలతో వదిలేస్తామంటూ మెసేజ్‌ కూడా చేశారని పోలీసులకు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన వడనపలాని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బాలమురగన్‌ సీరియస్‌ దర్యాప్తును ప్రారంభించారు. మూడు ప్రత్యేక విభాగాలు, ఓ సైబర్‌ క్రైమ్‌ బృందాన్ని ఏర్పాటు చేసి.. కృష్ణ ప్రసాద్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం ఓ స్థానిక షాపింగ్‌ మాల్‌కి వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు.. ఆపై ఇంటికి రాలేదని తేల్చారు. కృష్ణ ప్రసాద్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆన్‌లో ఉండటంతో సిగ్నల్‌ని ట్రేస్‌ చేయగా.. సికింద్రాబాద్‌లో ఉన్నాడని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆపై సికింద్రాబాద్‌కు చేరుకుని అతడిని అరెస్ట్‌ చేశారు. విచారణ కోసం చెన్నైకు తీసుకురాగా.. తనని ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని తనే కిడ్నాప్‌ డ్రామా ప్లాన్‌ చేశానని ఒప్పుకున్నాడు. ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్‌ అయిన కృష్ణ.. గతంలో షార్ట్‌ఫిల్మ్‌ పేరు చెప్పి బంధువులు, స్నేహితుల దగ్గరా డబ్బులు తీసుకోగా .. ఆ డబ్బుతో విలాసంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు