Crime News: నువ్వు అమాయకురాలివైతే.. నీ కుమార్తెను తగులబెట్టు!

భర్త అనుమానపు సూటిపోటి మాటలు భరించలేక.. తాను అమాయకురాలినని నిరూపించుకునేందుకు ఓ వివాహిత తన పదేళ్ల కుమార్తెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. తీవ్ర కాలిన గాయాలతో బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు...

Published : 02 Feb 2022 01:21 IST

చెన్నై: భర్త అనుమానపు సూటిపోటి మాటలు భరించలేక.. తాను అమాయకురాలినని నిరూపించుకునేందుకు ఓ వివాహిత తన పదేళ్ల కుమార్తెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. తీవ్ర కాలిన గాయాలతో బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. విస్మయకర విషయాలు తెలిశాయి. వారి వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన జయలక్ష్మి(38)కి మొదట ఓ వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరికి ఓ పాప పుట్టింది. అనంతరం ఆమె భర్తను వదిలేసి, అతని సోదరుడితోనే రెండో వివాహం చేసుకుని, ముంబయికి వెళ్లిపోయింది. అక్కడ వారికి పవిత్ర(10) పుట్టింది. తర్వాత ఆమె రెండో భర్తనీ వదిలేసి, పవిత్రతో కలిసి చెన్నైకి చేరుకుని తిరువొత్తియుర్‌లో ఉంటోంది. తొమ్మిదేళ్ల క్రితం స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుంది. అతనికి ఇది రెండో వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు.

అయితే, మద్యానికి బానిసైన పద్మనాభన్‌.. భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ అయింది. దీంతో తన పవిత్రతను నిరూపించుకోవాలని అతను ఆమెకు సవాల్‌ విసిరాడు. నీ కుమార్తె పవిత్రకు నిప్పంటించాలని.. ఒకవేళ నువ్వు అమాయకురాలివైతే ఆమెకు ఏం కాదని చెప్పాడు. దీంతో ఆమె.. నిద్రపోతున్న పాపను లేపి, కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. మంటలు తాళలేక బాలిక పెట్టిన కేకలు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు.. దంపతులిద్దరినీ అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని