Sangareddy: భార్యాభర్తల గొడవ.. ఏడాదిన్నర చిన్నారి అనుమానాస్పద మృతి
సంగారెడ్డి జిల్లాలో ఉగాది పర్వదినం రోజున విషాదం నెలకొంది. భార్యభార్తల గొడవ నేపథ్యంలో ఏడాదిన్నర చిన్నారి అనుమానస్పద స్థితిలో మృతిచెందింది.
కోహిర్: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో ఉగాది పండగపూట విషాదం నెలకొంది. భార్యాభర్తల గొడవ నేపథ్యంలో ఏడాదిన్నర చిన్నారి వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్త వేధింపులపై సర్పంచ్‌కి ఫిర్యాదు చేసేందుకు వెళ్లి వచ్చేలోపు తన కుమార్తె మృతిచెందిందని చిన్నారి తల్లి భాగ్యలక్ష్మి అనుమానం వ్యక్తం చేసింది. కులాంతర వివాహం చేసుకున్నామనే కోపంతో అత్త వనజాత నిత్యం వేధింపులకు పాల్పడుతోందని ఆమె ఆరోపించింది. గతంలోనూ ఏడునెలల పాప అనుమానాస్పద స్థితిలో మృతిచెందిందంటూ కన్నీటిపర్యంతమైంది. భర్త వెంకట్‌రెడ్డి, అత్త వనజాత పథకం ప్రకారం ఏడాదిన్నర పాపను గొంతునులిమి చంపేశారని కోహిర్ పోలీసులకు భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో భాగ్యలక్ష్మి భర్త వెంకట్‌రెడ్డి, అత్త వనజాత గ్రామంలో కనిపించకుండా పోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
kishan reddy: హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి: కిషన్ రెడ్డి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
-
India News
Odisha Train Accident: రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిల్..
-
India News
Odisha Train Accident: 1,000 మంది సిబ్బంది.. భారీ యంత్రాలతో ట్రాక్ పునరుద్ధరణ..
-
Sports News
Virat Kohli: విరాట్‌ను అడ్డుకోవడం అంత సులువేం కాదు: ఆసీస్ ఆల్‌రౌండర్