Andhra News: గన్నవరంలో దారుణం.. ప్రేమ పేరుతో బాలికను అపహరించిన చర్చి పాస్టర్
ఆరోగ్యం బాగోలేదని చర్చికి తీసుకెళ్లిన మైనర్ బాలికను స్వస్థత పేరుతో పాస్టర్ ట్రాప్ చేశాడు. మాయమాటలతో లోబర్చుకుని 3 రోజుల క్రితం బాలికను తన వెంట తీసుకెళ్లాడు.
గన్నవరం: ఆరోగ్యం బాగోలేదని చర్చికి తీసుకెళ్లిన మైనర్ బాలికను స్వస్థత పేరుతో పాస్టర్ ట్రాప్ చేశాడు. మాయమాటలతో లోబర్చుకుని 3 రోజుల క్రితం బాలికను తన వెంట తీసుకెళ్లాడు. నూజివీడులో చర్చి పాస్టర్‌గా ఉన్న వ్యక్తి మైనర్‌ను ట్రాప్ చేయడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన నాగేశ్వర్ భార్య ఆనారోగ్యంతో చనిపోయింది. అతనికి సుమారు 20ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. నూజివీడులో చర్చికి వచ్చిన బాలికకు స్వస్థత చేకూరుస్తానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను గత కొన్ని రోజులుగా గన్నవరం మండలం ఉస్తాబాద్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. బాలిక జాడ తెలుసుకున్న నాగేశ్వర్ ఈనెల 2న ఉస్తాబాద్ వచ్చి బాలికను తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగేశ్వర్‌తో పాటు బాలిక కూడా హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వీరిని గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP Constable Exam: అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!
-
India News
ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు: ప్రముఖ హృద్రోగ నిపుణుడి వ్యాఖ్యలు
-
India News
NEET PG 2023: ఎంబీబీఎస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. నీట్ పీజీ పరీక్షకు ఇంటర్న్‌షిప్ కటాఫ్ గడువు పెంపు
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం