Nellore: వైకాపా నేత చెప్పాడని.. సీఐ చితక బాదేశారు

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వైకాపా నేత చెప్పాడని వెంకటాచలం సీఐ .. ఓ వ్యక్తిని చితక బాదిన ఘటన స్థానికులను కలచివేసింది.

Updated : 21 Sep 2023 23:18 IST

వెంకటాచలం: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వైకాపా నేత చెప్పాడని వెంకటాచలం సీఐ .. ఓ వ్యక్తిని చితక బాదిన ఘటన స్థానికులను కలచివేసింది. కుటుంబ గొడవల్లో కనుపూరు వైకాపా సర్పంచ్‌ చెప్పాడని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చెవిటి వ్యక్తిని స్టేషన్‌కు తీసుకెళ్లి వెంకటాచలం సీఐ అంకమరావు చితక బాదారు. సీఐ కొట్టిన దెబ్బలు చూపించి బాధితుడు బోరున విలపించాడు.

బాధితుడు మోమిడి వెంకట రమణయ్య బీపీ, థైరాయిడ్‌, షుగర్‌తో బాధపడుతున్నాడని అతని భార్య నాగమ్మ తెలిపారు. ఒంటిపై గాయాలను చూపిస్తూ.. సీఐ మానవత్వం మరచి కొట్టాడని వాపోయారు. కాళ్లు చేతులు వాచిపోయేలా చితకబాదాడని ఆరోపించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ అంకమరావు బాధితుడిని బెదిరించి ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్ఛార్జి చేయించారని, తీవ్రగాయాలతోనే స్వగ్రామమైన ఇందూరుకు తీసుకెళ్లేలా చేశారని నాగమ్మ తెలిపారు. సీఐ అంకమరావు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని