Andhra News: సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబును అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును సీఐడీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విమానాశ్రయంలో బంగారం పట్టివేతపై పోస్టులు ఫార్వర్డ్‌ చేశారనే నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 23 Sep 2022 02:19 IST

విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విమానాశ్రయంలో బంగారం పట్టివేతపై పోస్టులు ఫార్వర్డ్‌ చేశారనే నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను గుంటూరులోని సీఐడీకి కార్యాలయానికి తరలించారు. దీనిపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబు అరెస్టు అక్రమమని చంద్రబాబు పేర్కొన్నారు. వాట్సప్‌లో ఒక వార్త ఫార్వర్డ్ చేశారని అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. విజయవాడ విమానాశ్రయంలో బంగారం పట్టివేత నిజం కాదా?అని ప్రశ్నించారు. అంకబాబును వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని