దిల్లీ క్రైంబ్రాంచ్‌కు కానిస్టేబుల్‌ అదృశ్యం కేసు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ వెంకట్‌రావు అదృశ్యం కేసును క్రైం బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. వెంకట్‌రావు భార్య రాజకుమారి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

Updated : 21 Dec 2022 17:08 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ వెంకట్‌రావు అదృశ్యం కేసును క్రైం బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. వెంకట్‌రావు భార్య రాజకుమారి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసు సమగ్రంగా, పారదర్శకంగా విచారణ జరిపేందుకు దిల్లీ క్రైం బ్రాంచ్‌కు అప్పగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
 సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్‌రావు.. మే నెలలో తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సెలవు మంజూరు కోసం దిల్లీలోని ధౌలాకువా కార్యాలయానికి బయలు దేరి వెళ్లిన వెంకట్‌ మే 26వ తేదీ నుంచి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి అతడి జాడ దొరకడం లేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజీవ్‌కుమార్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. వెంకట్‌రావు తరచుగా సెలవులు కోరడం విషయమై ఆయనతో గొడవలు జరిగినట్లు వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని