
Kolkata: దొంగతనం ఆరోపణతో యువకుడిని చితకబాదిన పోలీసు
కోల్‌కతా: చోరీకి యత్నించాడనే ఆరోపణతో యువకుడిని నడిరోడ్డుపై ఓ పోలీసు వాలంటీర్ చితకబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లో వెలుగుచూసింది. కోల్‌కతాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బస్సులో తన బ్యాగును ఆ యువకుడు దొంగిలించడానికి యత్నించాడని.. ఓ మహిళ ఆరోపించింది. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. అయితే.. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వాలంటీర్ తన్మయ్ బిశ్వాస్.. ఆ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాడు. అతడిని మరింత దారుణంగా కొట్టాడు. కాలుతో ఛాతీపై తన్నాడు. ఈ ఘటనపై పోలీసు శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తన్మయ్ బిశ్వాస్‌ను విధుల నుంచి తప్పించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.