ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చు.. నలుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో వేసవి ఎండలు ముదరకముందే అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. తాజాగా పౌరీ గర్వాల్‌, కమావు అటవీ ప్రాంతాల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. శనివారం దాదాపు 62హెక్టార్ల అటవీ ప్రాంతంలో సంభవించిన మంటల కారణంగా ఇప్పటి

Published : 05 Apr 2021 01:09 IST

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో వేసవి ముదరకముందే అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. తాజాగా పౌరీ గర్వాల్‌, కమావు అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. శనివారం దాదాపు 62హెక్టార్ల అటవీ ప్రాంతంలో సంభవించిన మంటల కారణంగా ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ మంటల్ని నిలువరించేందుకు రాష్ట్ర అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు 12వేల మంది సహాయ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నికీలల ధాటికి సుమారు రూ.37లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి ఈ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, మంటల నివారణకు భారత వాయుసేన హెలికాప్టర్లు అందించాలని కోరుతూ కేంద్రానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

కాగా, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు గురించి సీఎం తీరథ్‌ సింగ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించానన్నారు. వెంటనే రాష్ట్రానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని