Crime news: సైబీరియా బొగ్గు గనిలో మంటలు.. 9మంది మృతి!

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనుల్లో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది....

Published : 26 Nov 2021 00:15 IST

మాస్కో: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనుల్లో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో 44మందికి గాయాలు కాగా.. డజన్ల మంది మంటల్లో చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. నైరుతి సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ వెల్లడించింది. బొగ్గునిల్వలకు మంటలు అంటుకోగా.. వెంటిలేషన్‌ వ్యవస్థ ద్వారా మొత్తం ఆ గని పొగలు కమ్ముకొన్నట్టు తెలిపింది. ఈ దుర్ఘటన సమయంలో గనిలో 285 మంది ఉన్నారు. వీరిలో 237 మందిని రక్షించగా.. మిగతా వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భద్రతాపరమైన నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనే ఆరోపణలపై రష్యా దర్యాప్తు కమిటీ క్రిమినల్‌ విచారణను చేపట్టింది.

Read latest Crime News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని